నిజామాబాద్ పేరును ఇందూరుగా మారుస్తామని ఎంపీ అర్వింద్ పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో శుక్రవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. జిల్లా పేరు మార్పు డిమాండ్ ఎప్పటి నుంచో ఉందన్నారు. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఈసారి గెలుపు బీజేపీదేనని ఎంపీ అర్వింద్ తెలియజేశారు.