MBNR: జిల్లా రైల్వే స్టేషన్లో ఆధునీకరణ పనులు రాత్రింబవళ్లు శరవేగంగా జరుగుతున్నాయి. పాత భవనాన్ని తొలగించి, ట్రాక్ విస్తరణ పనులు చేపట్టారు. ప్రస్తుతం మొదటి ప్లాట్ ఫామ్ అందుబాటులో లేనందున, రైళ్లన్నీ రెండు, మూడు ప్లాట్ ఫామ్లపైనే ఆగుతున్నాయి. ప్రయాణికులు ఈ తాత్కాలిక ఇబ్బందిని గమనించి సహకరించాలని రైల్వే అధికారులు కోరారు.