కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ నటించిన లేటెస్ట్ ఫిల్మ్.. వినాయక చవితి సందర్భంగా.. ఆగష్టు 31న ప్రేక్షకుల ముందుకొచ్చింది. అజయ్ జ్ఞ్యాన ముత్తు దర్శకత్వంలో.. శ్రీనిధి శెట్టి హీరోయిన్గా నటిచింన ఈ సినిమాలో.. పలు రకాల గెటప్స్‌లో కనిపించాడు విక్రమ్. దాంతో కోబ్రా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. కానీ ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సోసోగానే నిలిచేలా ఉందంటున్నారు. ముఖ్యంగా కథనం పరంగా ఈ సినిమా కన్ఫ్యూజ్ చేసిందని అంటున్నారు. ఈ క్రమంలో విక్రమ్‌ను గెటప్‌ల పై కాకుండా కంటెంట్ పై దృష్టి సారించాలని అంటున్నారు ఆడియెన్స్. అయితే ఈ సినిమా చూసిన తర్వాత లెంగ్త్ ఎక్కువగా ఉందని అంటున్నారు ప్రేక్షకులు.
కోబ్రా రన్ టైం దాదాపు మూడు గంటల వరకు ఉండడంతో.. జనాలకు పరీక్ష పెట్టేలా ఉందని అంటున్నారు. ఇదే విషయం కోబ్రా మేకర్స్ దృష్టికి వెళ్లింది. దాంతో కోబ్రాను కోత పెట్టేందుకు సరికొత్త డెషిషన్ తీసుకున్నారు. సినిమా నిడివి చాలా ఎక్కువ ఉందని కొన్ని సీన్స్ తీసేస్తే బాగుండు అనే టాక్‌తో.. దాదాపు 20 నిమిషాలు సినిమాను ట్రిమ్ చేసినట్టు.. కోబ్రా మేకర్స్ అనౌన్స్ చేసారు. ఏ సినిమా చేసిన ఎంటర్టైన్మెంట్ ఇవ్వడం కోసమే చేస్తామని.. అయితే ప్రేక్షకుల కోరిక మేరకు 20 నిమిషాలు కట్ చేసినట్టు తెలిపారు. ఇక నుంచి తమిళ్,ఏపి, తెలంగాణ, కర్ణాటక, కేరళ ప్రేక్షకులకి.. కోబ్రా కొత్త వెర్షన్ అందుబాటులో ఉంటుందని.. అందరు సినిమా చూసి ఎంజాయ్ చెయ్యాలని చెప్పారు. అయితే కోబ్రాకు భారీగానే కత్తెర పడడంతో.. థియేటర్ ఆక్యుపెన్సీ పెరిగే ఛాన్స్ ఉందని చెప్పొచ్చు. మరి ట్రిమ్ చేసిన నిడివితో ‘కోబ్రా’.. థియేటర్‌కు జనాలను రప్పిస్తుందేమో చూడాలి.