Australia MPకి అవమానం.. పార్లమెంట్లోనే వేధింపులు, కన్నీటిపర్యంతం
పార్లమెంట్లో తోటి సభ్యుడు ఒకరు తనతో మిస్ బీహెవ్ చేశాడని ఆస్ట్రేలియా మహిళా ఎంపీ తెలిపింది. తనకు జరిగిన అవమానం గురించి నిండు సభలో చెప్పి.. కన్నీటి పర్యంతం అయ్యారు.
Australia MP: చట్టాలు చట్టసభల్లో కూడా మహిళలకు రక్షణ లేకుండా పోతుంది. అవును.. కొందరు మహిళలు తీవ్ర వేధింపులకు గురవుతున్నారు. అగ్రరాజ్యాల్లోనే ఇలాంటి ఘటనలు జరగడం.. పార్లమెంట్ వేదికగా సదరు బాధితులు తెలియజేయడం కలకలం రేపుతోంది. తాజాగా ఓ ఆస్ట్రేలియా ఎంపీ (Australia MP) తనకు జరిగిన అవమానం గురించి తెలియజేశారు. తానే కాదు.. చాలా మంది తనలా ఉన్నారని తెలిపారు.
ప్రజాస్వామ్య దేవాలయంలో ఇలా..?
పార్లమెంట్ అంటే ప్రజాస్వామ్య దేవాలయం.. ఇక్కడ ప్రజల కోసం చట్టాలు చేస్తుంటారు. ఆస్ట్రేలియా సెనేట్లో ఓ మహిళ లైంగిక వేధింపులను ఎదుర్కొంది. కన్జర్వేటివ్ పార్టీకి చెందిన సెనేటర్ డేవిడ్ వాన్ తనతో మిస్ బిహేవ్ చేశాడని తెలిపింది. వేధింపులు జరిగిన పరిణామ క్రమాన్ని పూసగుచ్చినట్టు పార్లమెంట్లో వివరించారు.
తాకేవారు..
‘ఆయన తనను ఫాలొ అయేవారు.. తాకేవారు. శృంగారం కోసం ప్రతిపాదనలు చేశారు. ఆఫీసు రూమ్ నుంచి బయటకు రావాలంటేనే భయపడే పరిస్థితి. డోర్ కొంచెం తెరచి, బయట లేరని నిర్ధారించుకున్న తర్వాత వచ్చేదాన్ని. పార్లమెంట్ వద్ద నడవాల్సి వచ్చిన సమయంలో కూడా తోడుగా ఒకరు ఉండేలా చూసుకోవాల్సి వచ్చింది. చాలా మంది బాధితులు ఉన్నారు.. ఎవరూ ముందుకు రావడం లేదు. భవిష్యత్ ఉండదని బయటకు రావడం లేదు. పార్లమెంట్ భవనం మహిళలకు సురక్షిత ప్రదేశం కాదు’ అని కన్నీటి పర్యంత అయ్యారు. పార్లమెంట్ నిబంధనలకు అనుగుణంగా కేసు నమోదు చేస్తానని కూడా తెలిపారు.
న్యాయపరంగా పోరాడుతా
మహిళా ఎంపీ (mp) చేసిన ఆరోపణలను డేవిన్ వాన్ ఖండించారు. నిరాధార ఆరోపణలు అని కొట్టిపారేశారు. ఈ అంశంపై న్యాయపరంగా పోరాడుతానని స్పష్టంచేశారు. ఆస్ట్రేలియా పార్లమెంట్లో (Australia parliament) ఇలాంటి ఘటన జరగడం ఇది తొలిసారి కాదు.. గతంలో ఓ మహిళపై (woman) కూడా ఇలాగే లైంగికదాడి జరిగిందని ఆరోపించింది. 2019లో అప్పటి రక్షణ మంత్రి లిండా రెనాల్డ్ ఆఫీసులో పనిచేసే సీనియర్ సిబ్బంది ఒకరు సమావేశం ఉందని పిలిచి లైంగికదాడికి పాల్పడ్డారట. ఈ ఇన్సిడెంట్ అప్పట్లో వివాదాస్పదమైంది. దీంతో ఆనాటి ప్రధాని స్కామ్ మారిసన్ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత మహిళకు సారీ కూడా చెప్పారు.