యాషెస్ చివరి టెస్టులో ట్రావిస్ హెడ్ అద్భుత సెంచరీతో ఆకట్టుకున్నాడు. ఇది అతడి టెస్టు కెరీర్లో 12వ సెంచరీ. ఇంగ్లండ్ తన తొలి ఇన్నింగ్స్లో 384 పరుగులకు ఆలౌట్ అవ్వగా, ఆస్ట్రేలియా దానికి ధీటుగా బదులిస్తోంది. ప్రస్తుతం ఆస్ట్రేలియా 2 వికెట్ల నష్టానికి 226 పరుగులు చేసింది. ఇంగ్లండ్ స్కోరుకు ఇంకా 158 పరుగుల దూరంలో ఉంది.