GDWL: బాలికలు, మహిళలు వేధింపులకు గురైతే మౌనంగా భరించవద్దు అని షీ టీమ్ హెడ్ కానిస్టేబుల్ శేషన్న పేర్కొన్నారు. జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు ఆదేశాల మేరకు ఆదివారం గద్వాల పట్టణంలోని ప్రభుత్వ గర్ల్స్ బీసీ హాస్టల్లో విద్యార్థినిలకు షీ టీమ్ ఆధ్వర్యంలో ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అల్లరి మూకల నుంచి రక్షణ కల్పించేందుకు షీ టీమ్ ఉంటుందని వారు తెలిపారు.