NLR: వింజమూరు ఎంపీపీ అధ్యక్ష ఎన్నిక సోమవారం నిర్వహించనున్నారు. ఎంపీడీవో కార్యాలయంలో ఎన్నికల అధికారి నిర్మలాదేవి పర్యవేక్షణలో ఉదయం 11 గంటలకు ఎన్నిక జరగనున్నది. మండలంలో 12 మంది ఎంపీటీసీలు ఉన్నారు. వీరిలో కొంతమంది టీడీపీ, వైసీపీ శిబిరాల్లో తలదాచుకుంటున్నారు. ఎన్నిక సమయానికి రెండు శిబిరాల్లో ఉన్న ఎంపీటీసీలు మండల ప్రజా పరిషత్ కార్యాలయానికి చేరుకుంటారు.