NLG: జి.యడవల్లి శివారులోని వ్యవసాయ క్షేత్రంలో సాగుతున్న పేకాట స్థావరంపై ఆదివారం సాయంత్రం జిల్లా టాస్క్ ఫోర్స్ పోలీసులు మెరుపు దాడి చేశారు. ఈ దాడుల్లో ముగ్గురు జూదరులను అరెస్ట్ చేయగా, మరో నలుగురు పరారయ్యారు. వారి నుంచి రూ.32 వేల నగదు, 3 బైకులు, 3 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వారిని తదుపరి చర్యల నిమిత్తం కనగల్ పోలీసులకు అప్పగించారు.