AKP: మునగపాక మండలంలో 87 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉన్నట్లు మండల వ్యవసాయ అధికారిణి జ్యోత్స్నకుమారి ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. రబీ సీజన్ లో రైతులకు ఎరువులు కొరత రాకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. తిమ్మరాజుపేటలో 12 మెట్రిక్ టన్నులు, తోటాడలో 12, పాటిపల్లిలో 12,చెర్లోపాలెంలో12, చూచుకొండలో 24 టన్నులు అందుబాటులో ఉన్నట్లు తెలిపారు.