KNR: జనం బాట కార్యక్రమంలో భాగంగా ఈ నెల 6, 7 తేదీల్లో జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సిరిసిల్ల జిల్లాలో పర్యటించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. 6న నేరెళ్ల ఇసుక బాధితులతో భేటీ అనంతరం తంగళ్ళపల్లి బీడీ కార్ఖానాను సందర్శిస్తారు. సివిల్ హాస్పిటల్లో రోగులతో మాట్లాడి, మల్కపేట రిజర్వాయర్ చేరుకుంటారని తెలిపారు. ఇందులో భాగంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొనాలన్నారు.