BKD: జిల్లాలో నిర్వహిస్తున్న ఉపాధ్యాయ అర్హత పరీక్షలు (టెట్) మొదటి రోజు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా పూర్తిగా ప్రశాంతంగా ముగిశాయని కలెక్టర్ జితేష్ వి.పాటిల్ తెలిపారు. మొదటి రోజు టెట్ పరీక్షలకు జిల్లాలో మొత్తం 400 మంది అభ్యర్థులు హాజరుకావాల్సి ఉండగా, అందులో 216 మంది అభ్యర్థులు మాత్రమే పరీక్షలకు హాజరై, 184 మంది అభ్యర్థులు గైర్హాజరు అయినట్లు తెలిపారు.