ప్రస్తుతం ప్రభాస్ చేస్తున్న సినిమాలన్నీ పాన్ ఇండియా స్థాయిలోనే తెరకెక్కుతున్నాయి. ఆదిపురుష్, సలార్, ప్రాజెక్ట్ కె.. ఈ సినిమాలన్నీ నెక్స్ట్ ఇయర్లో బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ కాబోతున్నాయి. అలాగే మారుతి సినిమా కూడా రెడీ అవుతోంది. ఈ సినిమాలన్నీ భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్నాయి. మొత్తంగా ఈ సినిమాల బడ్జెట్ రెండువేల కోట్లకు పైగా ఉంటుంది. ఇక ప్రభాస్ రెమ్యూనరేషన్ వచ్చేసి.. ఒక్కో సినిమాకు వంద నుంచి 150 కోట్ల వరకు అందుకుంటున్నాడు. అలాంటిది.. ప్రభాస్ అప్పు చేశాడంటే నమ్మశక్యంగా లేదు.. కానీ ఇండస్ట్రీ వర్గాల్లో మాత్రం ఇది హాట్ టాపిక్‌గా మారింది. అసలు ఇందులో ఎంతవరకు నిజముందో తెలియదు గానీ.. తాజాగా ప్రభాస్ 21 కోట్లు బ్యాంక్ లోన్ తీసుకున్నాడని ప్రచారం జరుగుతోంది. హైదరాబాద్‌లో ఉన్న ఓ ప్రాపర్టీపై ప్రభాస్.. 21 కోట్లు లోన్ తీసుకున్నారట. రీసెంట్‌గానే దానికి సంబంధించిన చెక్ అందుకున్నాడట డార్లింగ్. దానికి కూడా ఓ కారణం వినిపిస్తోంది. ఈ ఏడాది ప్రభాస్ నటించిన రాధే శ్యామ్ సినిమా భారీ నష్టాలను తెచ్చిపెట్టింది. అంతకు ముందు సాహో కూడా ఫ్లాప్ అయింది. ఈ రెండు సినిమాలు యూవీ క్రియేషన్ బ్యానర్లో తెరకెక్కాయి. ఇది ప్రభాస్ సొంత సంస్థ. ఈ నేపథ్యంలో.. ఆ సంస్థ నష్టాలను పూడ్చేందుకే ప్రభాస్ లోన్ తీసుకున్నట్లు టాక్. దాంతో ఈ న్యూస్ నిజంగానే షాక్ ఇచ్చేలా ఉంది. మరి ప్రభాస్ నిజంగానే లోన్ తీసుకున్నాడా.. తీసుకుంటే ఎందుకు తీసుకున్నాడు.. సినిమాల వల్ల వచ్చిన నష్టాల వల్లేనా.. అనేది ఇండస్ట్రీ వర్గాలకే తెలియాలి.