MDK: చేగుంట మండలం పోలంపల్లి గ్రామ అభివృద్ధికి నిధులు కేటాయించాలని సర్పంచ్ కొండి రాజ్యలక్ష్మి స్వామి కోరారు. ఆదివారం ఎంపీ మాధవనేని రఘునందన్ రావును మర్యాదపూర్వకంగా కలిశారు. పోలంపల్లి చౌరస్తా నుంచి రెడ్డిపల్లి కాలనీ వరకు రోడ్డు, రైతుల కోసం మినీ గోదాము, ఓపెన్ జిమ్, చత్రపతి శివాజీ, అంబేద్కర్ విగ్రహాలు, సోలార్ వీధి దీపాలు ఏర్పాటు చేయాలని ఎంపీని కోరారు