న్యూజిలాండ్తో వన్డే సిరీస్కు ప్రకటించిన భారత జట్టులో పాండ్యా, బుమ్రా పేర్లు లేకపోవడంతో అభిమానుల్లో గందరగోళం నెలకొంది. దీనిపై తాజాగా BCCI స్పష్టత ఇచ్చింది. ‘వర్క్ లోడ్ మేనేజ్మెంట్’లో భాగంగానే వారికి ఈ సిరీస్ నుంచి విశ్రాంతి కల్పించినట్లు తెలిపింది. త్వరలోనే WC సమీపిస్తుండటంతో.. వారి ఫిట్నెస్ను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది.