NZB: రహదారులపై మూలమలుపులో ఉన్న చెట్ల కొమ్మలను పిచ్చి మొక్కలను తొలగించాలని రవాణా శాఖ అధికారి ఉమామహేశ్వరరావు తెలిపారు. జిల్లాలోని మాక్లూర్, ఆర్మూర్ రహదారులను శనివారం రవాణా శాఖ, ఆర్ అండ్ బీ అధికారులు పరిశీలించారు. ఈ సందర్భంగా డీటీవో మాట్లాడుతూ.. ప్రమాదాల నివారణకు సంబంధిత అధికారులు తగు చర్యలు తీసుకోవాలని సూచించారు.