E.G: చరిత్రలో గుర్తుండిపోయే విధంగా దేవాలయాలకు అతి తక్కువ సమయంలో నిధులు కేటాయించిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందని మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. నిడదవోలు రూరల్ మండలం విజ్జేశ్వరంలో కొలువైన గ్రామ దేవత శ్రీ మహాలక్ష్మీ అమ్మవారి ఆలయనిర్మాణానికి తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని శ్రీవాణి ట్రస్ట్ ద్వారా మంజూరైన రూ.9,85,936/- చెక్‌ను సోమవారం అందజేశారు.