ADB: ఎస్.ఐ.ఆర్-2002 జాబితాతో 2025 ఓటర్ల జాబితా మ్యాపింగ్ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం సీఈవో సుదర్శన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. శనివారం హైదరాబాద్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా అదనపు కలెక్టర్ శ్యామలదేవి పాల్గొన్నారు. రాబోయే 15 రోజులలో కనీసం 70 శాతం మ్యాపింగ్ పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.