SDPT: మండల కేంద్రం బెజ్జంకిలోని దుర్గమ్మ ఆలయంలో మాజీ సర్పంచ్ రావుల నరసయ్య ఆధ్వర్యంలో శనివారం దుర్గమ్మ పట్నాలు, బోనాల వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఎడ్ల బండ్లు, ట్రాక్టర్లు, ఆటోలతో భారీ ఊరేగింపు నిర్వహించి ఆలయాన్ని చుట్టూ ప్రదర్శించారు. అనంతరం దుబ్బు కళాకారుల వాయిద్యాల మధ్య బోనాలు, పుట్ట బంగారాన్ని భక్తిశ్రద్ధలతో ఆలయానికి తరలించారు.