AP: భోగాపురం విమానాశ్రయం ఘనత వైసీపీ అధినేత వైఎస్ జగన్‌దేనని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పష్టం చేశారు. ఉత్తరాంధ్ర ప్రజల ఆకాంక్షను జగన్ నెరవేర్చారని గుర్తు చేశారు. భూసమీకరణ కోసం బాధితులకు రూ.1100 కోట్ల పరిహారం కేటాయించారన్నారు. 2023, మే 3న జగన్ శంకస్థాపన చేశారని, 2025 డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని జీఎంఆర్‌కు అప్పగించారని తెలిపారు.