VSP: విశాఖలో గాలి కాలుష్యానికి కారణమైన కంపెనీలపై కాలుష్య నియంత్రణ మండలి రూ.10 కోట్ల జరిమానా విధించింది. గత నెల 21 నుంచి నిర్వహించిన తనిఖీల్లో విశాఖ పోర్టు, హెచ్పీసీఎల్, కోరమాండల్ ఇంటర్నేషనల్, విశాఖ ఉక్కు కర్మాగారం, హిందూజా పవర్ ప్లాంట్లలో లోపాలు గుర్తించారు. అలాగే వాహన కాలుష్య నియంత్రణలో భాగంగా 159 వాహనాలకు రూ.17.54 లక్షల జరిమానా విధించారు.