MBNR:జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయేషా (25) శుక్రవారం మృతి చెందింది. ఎస్సై శేఖర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం .. గత నెల 5న సదరు యువతిపై ప్రమాదవశాత్తు వేడి నీళ్లు పడి తీవ్రంగా గాయపడింది. తొలుత కుటుంబ సభ్యులు ఇంట్లోనే చికిత్స అందించారు. పరిస్థితి విషమించడంతో జిల్లా ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించింది.ఈ మేరకు కేసు నమోదు చేశారు.