SDPT: దుబ్బాక చేనేత సంఘాన్ని రాష్ట్ర చేనేత ఐక్య వేదిక అధ్యక్షుడు రాపోల్ వీర మోహన్ సందర్శించారు. చేనేత కార్మికులతో సమావేశమై సంఘం అండగా ఉంటుందని చెప్పారు. ప్రభుత్వం వెంటనే స్పందించి జియో ట్యాగింగ్ చేపట్టి ఉపాధి అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు ముదిగొండ శ్రీనివాస్ ట్రిఫ్ట్ ఫండ్ విడుదల చేయాలని కోరారు.