మార్కాపురం : ప్రజలు సంతృప్తి చెందేలా అర్జీలను పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే.విజయానంద్ ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడారు. ఈ కాన్ఫరెన్స్లో మార్కాపురం కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ పీ.రాజబాబు, జిల్లా రెవెన్యూ అధికారి ఓబులేసు, జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.