AP: విజయవాడ దుర్గమ్మ ఆలయ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. వీఐపీ, వీవీఐపీ దర్శనాలకు టికెట్ తీసుకోవడం తప్పనిసరి చేశారు. రోజుకు 300 మంది సిఫార్సు లెటర్లతో.. టికెట్ లేకుండానే ఉచితంగా దర్శనం చేసుకుంటున్నారని, దీనివల్ల ఆలయానికి గండి పడుతోందని అధికారులు గుర్తించారు. ఈ ఆదాయ నష్టాన్ని అరికట్టేందుకే టికెట్ నిబంధనను కఠినతరం చేసింది.