అన్నమయ్య జిల్లాలో విద్యార్థినుల భద్రత కోసం పాఠశాలలు, కళాశాలల వద్ద డ్రోన్ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ ధీరజ్ తెలిపారు. ఆకతాయిల ఆగడాలు, ఈవ్ టీజింగ్‌ను అరికట్టేందుకు శక్తి టీమ్స్ పర్యవేక్షణ కొనసాగిస్తాయని, చట్టవిరుద్ధ చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వేధింపులపై వెంటనే 100 / 112కు సమాచారం ఇవ్వాలని సూచించారు.