AP: తిరుమలకు టీటీడీ కీలక ప్రకటన చేసింది. రేపు జరగాల్సిన పౌర్ణమి గరుడసేవను రద్దు చేస్తున్నట్లు స్పష్టం చేసింది. శ్రీవారి ఆలయంలో అధ్యయనోత్సవాల కారణంగా పౌర్ణమి గరుడసేవ రద్దు చేసినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. గరుడసేవల్లో పాల్గొనాలనుకున్న భక్తులు ఈ ప్రకటన మేరకు ప్లాన్ చేసుకోవాలని సూచించారు.