GNTR: ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలో ఫిబ్రవరి 5వ తేదీ నుండి జరగనున్న బీఈడీ మొదటి సెమిస్టర్ పరీక్ష ఫీజు షెడ్యూల్ను వర్సిటీ పరీక్షల నిర్వహణ అధికారి శివప్రసాదరావు శుక్రవారం విడుదల చేశారు. సంబంధిత పరీక్ష ఫీజు ఈనెల 27వ తేదీలోగా, అపరాధ రుసుం రూ.100తో ఈనెల 28వ తేదీన చెల్లించాలన్నారు. పూర్తి వివరాలను వర్సిటీ వెబ్సైట్లో చూడొచ్చన్నారు.