MBNR: జిల్లాలో ఈ నెల 3 నుంచి 20 వరకు నిర్వహించే టీజీ టెట్ పరీక్షల నేపథ్యంలో పరీక్ష కేంద్రాల పరిసరాల్లో 163 BNSS యాక్ట్ అమలు చేస్తున్నట్లు ఎస్పీ డి.జానకి శుక్రవారం తెలిపారు. పరీక్షలు సజావుగా సాగేందుకు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.