NRML: గ్రామాభివృద్ధే లక్ష్యంగా సర్పంచులు పనిచేయాలని ఎంపీడీవో సురేష్ సూచించారు. ఎంపీడీవో కార్యాలయంలో నూతనంగా ఎన్నికైన సర్పంచులతో నిర్వహించిన సమావేశంలో గ్రామ సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను వేగంగా పూర్తిచేయాలని కోరారు. అనంతరం సర్పంచులను శాలువాలతో సన్మానించారు.