NGKL: ఎరువుల డీలర్లు ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనల ప్రకారమే యూరియా పంపిణీ చేయాలని కలెక్టర్ సంతోష్ ఆదేశించారు. రైతు పట్టా విస్తీర్ణం, సాగు చేస్తున్న పంటను ఏఈఓలు ధ్రువీకరణతో అవసరమైన మేరకే విక్రయించాలని సూచించారు. ఈ యాసంగిలో ఇప్పటివరకు జిల్లాలో 14,363 టన్నుల యూరియా పంపిణీ చేశామని, ప్రస్తుతం మరో 3,654 టన్నుల నిల్వలు అందుబాటులో ఉన్నాయని ఆయన తెలిపారు.