విశాఖలోని జీవీఎంసీ 40వ వార్డు పరిధి ఏకేసీకాలనీలో బిగ్బాస్ సీజన్–9 తెలుగు విజేత కళ్యాణ్ పడాల శుక్రవారం సందడి చేశారు. వార్డు కార్పొరేటర్ గుండపు నాగేశ్వరరావు ఘనంగా స్వాగతం పలిగి, పూలమాలలు వేసి అభినందనలు తెలిపారు. కళ్యాణ్ తన విజయం వెనుక ప్రజల సపోర్ట్ ఉందని, ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు.