NLG: పరిశీలన ద్వారా విషయాన్ని అవగాహన చేసుకుని సమస్యను పరిష్కరించేందుకు విద్యార్థులు ప్రయత్నించాలని జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ అన్నారు. ఎస్పీ శరత్ చంద్ర పవార్‌తో కలిసి జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో నల్గొండ పట్టణంలోని డైట్ కళాశాలలో రెండు రోజులపాటు నిర్వహిస్తున్న జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనను ప్రారంభించి మాట్లాడారు.