SRD: తెలంగాణ పద్మశాలి ఉద్యోగుల సంఘం ఉమ్మడి మెదక్ జిల్లా ఆధ్వర్యంలో రూపొందించిన 2026 నూతన సంవత్సర క్యాలెండర్ను శుక్రవారం సంగారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ ప్రావీణ్య చేతుల మీదుగా ఘనంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా అధ్యక్షులు జట్ల. భాస్కర్ మాట్లాడుతూ.. పద్మశాలి ఉద్యోగుల ఐక్యత, సంక్షేమం, వృత్తి అభివృద్ధికి సంఘం నిరంతరం కృషి చేస్తుందన్నారు.