NLG: ఫీల్డ్ అసిస్టెంట్లు ‘చలో హైదరాబాద్’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఉమ్మడి జిల్లా ఫీల్డ్ అసిస్టెంట్ల యూనియన్ మాజీ అధ్యక్షులు మర్రి రమేష్ పిలుపునిచ్చారు. మంత్రి సీతక్క సిబ్బంది సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకుంటారని హామీ ఇవ్వగా కేంద్రం గుదిబండగా మారి పథకం పేరు మార్చిందని అన్నారు. చట్టంలో అనేక మార్పులు చేయడంతో తమకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు.