SKLM: రాష్ట్రంలో రవాణా వ్యవస్థను మరింత సులభతరం చేస్తూ, ప్రమాదాల నివారణకు రైల్వే గేట్ల రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం వెలగపూడి సచివాలయం నుంచి జిల్లా కలెక్టర్లతో శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రైల్వే వంతెనలు, అండర్ వే పాస్ రహదారి నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందించాలన్నారు.