W.G: పెంటపాడు మండలం ప్రత్తిపాడులో ఓ దినపత్రిక కార్యాలయం ఎదురుగా పంట బోదెలోకి ఆర్టీసీ బస్సు దూసుకెళ్లిన ఘటన శుక్రవారం జరిగింది. డ్రైవర్ మురళీకృష్ణకు కళ్లు తిరగడంతో అదుపు తప్పి పంట బోదెలోకి దూసుకెళ్లినట్లు సమాచారం. తణుకు నుంచి ఏలూరు వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించినట్లు తెలుస్తోంది. ప్రమాద సమయంలో బస్సులోని నలుగురు ప్రయాణికులు ఉండగా, వారు క్షేమంగా ఉన్నారని డ్రైవర్ తెలిపాడు.