HYD: దుర్గం చెరువు ఆక్రమణ ఆరోపణలను బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. దుర్గం చెరువు కబ్జా అనేది పూర్తిగా నిరాధారమని స్పష్టం చేశారు. తనకు అక్కడ గజం భూమి కూడా లేదని, ప్రభుత్వ భూమి కబ్జా చేసినట్లు నిరూపిస్తే ఏ శిక్షకైనా సిద్ధమని సవాల్ విసిరారు. కావాలని, కక్షతోనే తనపై కేసు పెట్టారని ఆరోపించారు.