SDPT: సిద్దిపేట ఐటీ టవర్ (4వ అంతస్తు)లో శనివారం టాటా ఎలక్ట్రానిక్స్ ఉద్యోగాల భర్తీ కోసం జాబ్ మేళా నిర్వహించనున్నారు. GENESYS INFOX ఇంఛార్జ్ విజయ్ కుమార్ వివరాల ప్రకారం.. పదో తరగతి నుంచి పీజీ వరకు చదివిన 18 నుంచి 35 ఏళ్ల వయస్సు గల మహిళా అభ్యర్థులు ఈ ఇంటర్వ్యూలకు హాజరుకావచ్చన్నారు. ఎంపికైన వారికి బెంగళూరుకు సమీపంలోని హోసూరులో ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని చెప్పారు.