GDWL: గద్వాల జిల్లా బీచుపల్లి పుణ్యక్షేత్రంలోని కోదండరామ స్వామి దేవస్థానంలో సీతారాముల కల్యాణాన్ని ఆదివారం నిర్వహించనున్నామని బీచుపల్లి క్షేత్ర మేనేజర్ సురేంద్ర రాజు శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. అద్భుత ఘట్టాన్ని కనులారా వీక్షించడానికి భక్తులు తరలిరావాలని ఆలయ అర్చకులు పేర్కొన్నారు. స్వామి దేవస్థానంలో వేడుకల కోసం ఇప్పటికే రంగం సిద్ధమైంది.