KDP: వల్లూరు మండలం వెంకటేశ్వరపురం గ్రామంలో తహసీల్దార్ శ్రీవాణి ఆధ్వర్యంలో రెవెన్యూ గ్రామసభ నిర్వహించారు. రీ సర్వే మొదటి దశ పూర్తయిన రైతులకు పాత పట్టాదార్ పాస్ బుక్కులు తీసుకుని నూతన పట్టా పాస్ బుక్కులు పంపిణీ చేశారు. భూ రికార్డుల్లోని తప్పులు సరిదిద్దుతూ రైతులకు హక్కులు కల్పించడమే లక్ష్యమని తహసీల్దార్ తెలిపారు.