MNCL: మొక్కజొన్న పంటను ఆశించే మొగు పురుగు నివారణకు రైతులు వేప నూనెను స్ప్రే చేయాలని జన్నారం మండలంలోని పోన్కల్ క్లస్టర్ ఏఈవో త్రిసంధ్య సూచించారు. శుక్రవారం జన్నారం గ్రామ శివారులో రైతులు వేసిన మొక్కజొన్న పంటను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులకు పలు సూచనలు చేశారు. మొక్కజొన్నలో పెరిగే కలుపు మొక్కలు, గడ్డిని ఎప్పటికప్పుడు తొలగించాలని AEO తెలిపారు.