WGL: నర్సంపేటకు చెందిన యువ దర్శకుడు రాకేష్ మాధవన్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ఈరోజు విడుదలైంది. యాష్నా ముత్తులూరి హీరోగా, నేహా పఠాన్ హీరోయిన్గా నటించారు. తనదైన శైలితో సినీ రంగంలో గుర్తింపు తెచ్చుకుంటున్న రాకేష్ మాధవన్ నర్సంపేట వాస్తవ్యుడు కావడం విశేషం. ఈ చిత్రం ద్వారా నర్సంపేట పేరు తెలుగు సినిమా రంగంలో మరింత ప్రతిష్ఠాత్మకంగా వినిపిస్తోంది.