ADB: వీడీసీల ఏర్పాటు రాజ్యాంగ విరుద్ధమని జిల్లా SP అఖిల్ మహాజన్ శుక్రవారం అన్నారు. వీడీసీల అక్రమ వసూళ్లకు దందాలకు సెటిల్ మెంట్లకు అవకాశాలు లేవన్నారు. ప్రజలు వీడీసీల వల్ల ఎలాంటి సమస్యలు ఉన్న ప్రభుత్వ యంత్రాంగాన్ని సంప్రదించాలని సూచించారు. గ్రామ అభివృద్ధి పేరిట అక్రమ వసూళ్లకు పాల్పడిన వారిపై చట్ట ప్రకారంగా కేసులు నమోదు చేయబడతాయని ఆమన హెచ్చరించారు.