యూట్యూబర్ అన్వేష్ దేశ ద్రోహి అని నటి కరాటే కళ్యాణి ఆరోపించారు. కనిపిస్తే హిందువులు వదిలిపెట్టరని, ఇన్స్టాగ్రామ్ టెర్రరిస్ట్‌గా చూడాలన్నారు. అన్వేష్‌పై సీపీ చర్యలు తీసుకోవాలని కోరారు. కాగా, అతడిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామని పంజాగుట్ట సీఐ తెలిపారు. వివరాలు కోరుతూ ఇన్‌స్టాకు మెయిల్ పంపించామని, వివరాలు వచ్చిన తర్వాత నోటీసులు జారీ చేస్తామన్నారు.