TG: మావోయిస్టు పార్టీకి మరో ఎదురుదెబ్బ తగలనుంది. డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట మావోయిస్ట్ పార్టీ గెరిల్లా లిబరేషన్ ఆర్మీ చీఫ్ బరిసె దేవా లొంగిపోనున్నాడు. హిడ్మా తరువాత మావోయిస్టు పార్టీ సాయుధ బలగాల వ్యవహారాలను దేవా చూసేవాడు. హిడ్మా, బరిసె దేవా ఒకే గ్రామానికి చెందినవారు. మావోయిస్టు పార్టీకి ఆయుధాల సరఫరాలో అత్యంత కీలకపాత్ర పోషించాడు.