WGL: తెలంగాణలో నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉమ్మడి WGL జిల్లాలో ప్రధాన సమస్యల పై ఉమ్మడి జిల్లా MLAలు అసెంబ్లీలో గళం విప్పుతారా అనే ఆసక్తి ప్రజల్లో నెలకొంది. యూరియా సమస్యలు, మొంథా తుఫాను వల్ల వరంగల్, హన్మకొండ జిల్లాల్లో రహదారులు, వంతెనలకు జరిగిన నష్టం గురించి ప్రస్తావిస్తారా అని ఆశతో ఎదురుచూస్తున్నారు.