ప్రకాశం: మార్కాపురంకు చెందిన దేవరకొండ మల్లేశ్వరి అనే మహిళ గత 13 రోజులుగా కనిపించడం లేదని కుటుంబ సభ్యులు శుక్రవారం తెలిపారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న మల్లీశ్వరిని యర్రగొండపాలెంలో చికిత్స అందిస్తుండగా అదృశ్యమైందని ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మహిళను గుర్తిస్తే తమకు సమాచారం ఇవ్వాలని కుటుంబ సభ్యులు కోరారు.