TG: మూసీ ప్రక్షాళన కావాలా? వద్దా అని సీఎం రేవంత్ ప్రతిపక్షాలను ప్రశ్నించారు. ప్రజలకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో చెప్పండని, మూసీలో ఉండే కాలుష్యం కంటే.. కొంతమంది కడుపులో విషం ఎక్కువుందన్నారు. తాము వివరాలు చెప్పే ప్రయత్నం చేస్తుంటే విషం కక్కుతున్నారని, ప్రజలకు ప్రభుత్వం చేసేది తెలియొద్దు అనేది వాళ్ల ఉద్ధేశమన్నారు. అవతలి వాళ్లు మాడిపోయేలా కొందరి చూపులున్నాయని తెలిపారు.