ప్రకాశం: రాష్ట్ర ప్రభుత్వం మార్కాపురాన్ని నూతన జిల్లాగా ప్రకటించడంతో పరిపాలనా వ్యవస్థలో కీలక మార్పులు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో కంభం మండలంలోని ప్రభుత్వ కార్యాలయాలపై ‘ప్రకాశం జిల్లా అనే పేరును తొలగించి,దాని స్థానంలో మార్కాపురం జిల్లా అనే పేరును అధికారికంగా అమలు చేశారు. కంభం మండల తహసీల్దార్ కిరణ్ ఆధ్వర్యంలో ఈ మార్పులు చేపట్టారు.