KMR: బాన్సువాడలోని తిరుమల మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ రతన్ సింగ్, పుట్టిన పది రోజుల పిల్లలకు కేవలం పది రూపాయలకే ఓపీ సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. వైద్య ఖర్చుల భయంతో చాలా మంది శిశువులకు సకాలంలో వైద్యం చేయించలేకపోతున్నారని, దీనివల్ల దీర్ఘకాలిక సమస్యలు తలెత్తుతున్నాయని ఆయన అన్నారు. అందుకే శిశువులకు పది రూపాయలకే వైద్యం అందించాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు.